మా వైపు ఫంక్షన్లలో ,పెళ్ళిళ్ళ లో ఎక్కువగా గుమ్మడికాయ దప్పళం వండుతారు.దీనినే పులుసు ,కలగలుపు అని కూడా అంటారు.
దీనికీ కావలసిన పదార్దాలు...
గుమ్మడికాయ -చిన్నది ఒకటి
ఆనప కాయ -చిన్న ముక్క
ఉల్లిపాయలు -రెండు
పచ్చిమిర్చి -ఆరు
బెండకాయలు -పది
టమాటాలు -మూడు
ములక్కాడ -ఒకటి
వంకాయలు -రెండు
కొత్తిమీర-ఒకకట్ట
పోపు పెట్టుకోవడానికి
చీరికలుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు -గుప్పెడు
మెంతులు -అర స్పూను
ఆవాలు -అరస్పూను
జీలకర్ర -అరస్పూను
ఎండుమిరప కాయలు -రెండు
కరివేపాకుకొద్దిగా
చింతపండు కొద్దిగా
బెల్లం కొద్దిగా
తయారుచేసేవిదానం .....
గుమ్మడికాయ ,ఆనపకాయ ముక్కలు కాస్త పెద్దగా కోసుకోవాలి . గిన్నె లో నీరు పోసి,గుమ్మడికాముక్కలు,ఆనపకాయ ముక్కలు వేయాలి .అవి కాసేపు ఉడకనిచ్చి , ముక్కలుగాకోసుకొన్న మిగిలిన కూరగాయముక్కలు ,ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కోసుకుని అవి, పచ్చిమిర్చి ముక్కలు దానిలోవేయాలి.
కొద్దిగా వుడికాక కారము ,ఉప్పు ,పసుపు వేసుకొని...చింతపండుపులుసు ,బెల్లము వేసుకోవాలి.
పులుసు చిక్కగా కావాలనుకుంటే ఉడకబెట్టిన కందిపప్పు మెత్తగా చేసి కలుపు కోవాలి .కాసేపు ఉడకనిచ్చి తాలింపు పెట్టుకోవాలి.
తాలింపులో ముందు ఉల్లిపాయ చీరికలు వేసుకుని వేగేక మిగిలిన తాలింపు సరుకులు వేసుకో వాలి.నూనె తో పాటు అరస్పూన్ నెయ్యి కూడా వేసి తాలింపు పెడితే బాగుంటుంది.తరువాత కొత్తిమీర జల్లుకోవాలి .
దప్పళం వండినప్పుడు ముద్దపప్పు తప్పకుండా ఉండాలి .
దీనిని ముద్దపప్పులో కలుపుకొని తింటే ఉంటుందీ ..........
పపపపప్పు ..దప్పళం ......
వేడి వేడి అన్నం మీద....కమ్మనిపప్పు కాచిన నెయ్యి ...కలిపితే ...
రాధిక గారూ.. మరీ రెండే వంటలు పోస్ట్ చేసారేంటండీ? ప్రసాదం ట్రై చేసాను. బావుంది. దప్పళం చేసుకునేలోపు త్వరగా నెక్స్ట్ పోస్ట్ రాసేయండే :)
రిప్లయితొలగించండి