మా ఊరులో వ్రతాలు,పూజలు చేసినప్పుడు ఆవునెయ్యి,ఆవు పాల తో గోదుమరవ్వ కేసరి ని ప్రసాదంలా చేసి అందరికీ పంచుతారు.అందుకే ఈ రవ్వ కేసరిని ప్రసాదం అంటాము.
కావలసిన పదార్ధాలు...
గోదుమరవ్వ -1కప్పు
పాలు -2 కప్పులు
పంచదార -1 కప్పు(తీపి ఎక్కువ కావాలనుకుంటే 1 1/2 కప్పు )
నెయ్యి -1/2 కప్పు
యాలికల పొడి -1 స్పూన్
వేయించిన జీడిపప్పు, కిస్మిస్
దీనిని పాలుతోనే కాదు నీళ్ళ తోనూ చేసుకోవచ్చు.పాలు తో చేస్తే రుచి బాగుంటుంది . లేకపోతె 1కప్పుపాలు ,1కప్పు
నీళ్ళ తో నైనా చేసుకోవచ్చు. ఎలా చేసినాకొలత మాత్రం ఒకటి కి రెండు.
దళసరిగా ఉన్న గిన్నెలో చేస్తే చేసేటప్పుడు అడుగున అంటుకోకుండా ఉంటుంది.
తయారు చేసే విదానం...
ముందుగా రవ్వని నెయ్యి లో వేయించుకోవాలి.దానిని ఒక ప్లేట్లో పోసి చల్లారనిచ్చి ,పంచదార కలుపుకోవాలి.
ఇలా రెండూ కలుపుకుంటే రవ్వ పాలలో వేసినప్పుడు గడ్డ కట్టకుండా ఉంటుంది.
గిన్నెలో పాలు పోసి ,దానిలో రవ్వ ,పంచదార మిశ్రమాన్ని వెయ్యాలి.పాలు గరిటెతో తిప్పుకుంటూ నెమ్మిదిగా
వేసుకుంటే ముద్ద ముద్ద లా అవకుండా ఉంటుంది. ఉడకడం మొదలవ్వగానే ఒకో స్పూన్ నెయ్యి వేస్తూ
తిప్పుతుండాలి. మిశ్రమం కొంచెం దగ్గర పడగానే స్టవ్ ఆపేయాలి. యాలికల పొడి, మిగిలిన నెయ్యి
జీడిపప్పు,కిస్మిస్ వేసి కలుపుకోవాలి.
sweet start. carry on...Best wishes :-)
రిప్లయితొలగించండిథాంక్సండి
రిప్లయితొలగించండిమీ కొత్తబ్లాగ్ కాన్సెప్ట్ బాగుంది. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ, రాధిక గారు.
రిప్లయితొలగించండిధన్యవాదాలండి
తొలగించండిబావుందండీ మీ కొత్త బ్లాగ్.. మీ ఊరి వంటల రుచులు తెలుసుకోడానికి ఎదురు చూస్తాం.. :)
రిప్లయితొలగించండిథాంక్స్ మధుర గారు.
తొలగించండిsweet to start chesina mee kotta blog maa oori ruchulu chala sweet ga saagalani korukuntunnanandi Radhikagaru.ALL THE VERY BEST|
రిప్లయితొలగించండిమాంచి తీపి వంటకంతో మొదలెట్టారనమాట, బాగుందండీ.. ఆల్ ద బెస్ట్.
రిప్లయితొలగించండిథాంక్స్ అజ్ఞాత గారు.
రిప్లయితొలగించండిథాంక్స్ వేణూశ్రీకాంత్ ధన్యవాదాలు