నూపిండి కూర నాటు చిక్కుడుకాయలతో చేసుకుంటే బాగుంటుంది. ఈ సీజన్ లో బాగా దొరుకుతాయి.
చిక్కుడుకాయలు 1/2కేజి
తాలింపు సరుకులు
సెనగపప్పు
మినప్పప్పు
ఆవాలు
జీలకర్ర
ఎండుమిర్చి
కరివేపాకు
నువ్వుల పిండి కి
నూపప్పు - పావుకేజీ
ఎండుమిరపకాయలు -5
వెల్లుల్లి గబ్బాలు -7
జీలకర్ర -అరస్పూన్
ఉప్పు
బెల్లం
చిక్కుడుకాయలు మొదలు ,చివర్లు కట్ చేసుకోవాలి. (కట్ చేసేటప్పుడు ఈనెలు రాకుండా చూడాలి .ఈనెలు ఊడిపోతే కాయలు విడిపోయి తొక్కలు,గింజల్లా ఉండి కూర బాగోదు.)కట్ చేసుకున్నవాటిని కొద్దిగా ఉప్పు,పసుపు వేసుకుని ఉడకబెట్టుకోవాలి. రెండు కూతలొస్తే చాలు.ఎక్కువ ఉడికితే కాయలు విడిపోతాయి .
తాలింపు పెట్టుకుని ,తాలింపులో ఉడకబెట్టిన చిక్కుడుకాయలను ఐదు నిముషాలు కాయలు విడిపోకుండా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి
నూపొడికి
నూపప్పు ,ఎండుమిరప కాయలు వేపుకోవాలి . చల్లారక ముందుగా ఎండు మిరపకాయలు ,ఉప్పు,వెల్లుల్లి ,జీలకర్ర మిక్సిలో వేసుకుని ,పోడయ్యాక నూపప్పు వేసుకోవాలి .(నూపప్పు ఎక్కువసేపు తిప్పకూడదు .తిప్పితే ముద్దలా అవుతుంది)నలిగాక బెల్లం కూడా వేసి పొడి చేసుకోవాలి.ఈ పొడిని వేపుకున్న చిక్కుడుకాయ కూరలో కలుపుకోవాలి.
ఈ నువ్వుల పొడి విడిగా కూడా వేడివేడన్నం లో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
పొట్లకాయ,ఆనపకాయ తో కూడా ఇలా నూపిండి కూర చేసుకోవచ్చు .